‘రాష్ట్ర సంపదను ప్రజలకు సమానంగా పంచటమే ప్రభుత్వ లక్ష్యం’: డిప్యూటీ సీఎం భట్టి

by Kodari Anjali |   (  Updated:2026-01-21 11:51:36  IST  )

రాష్ట్ర సంపదను ప్రజలకు సమానంగా పంచటమే ప్రభుత్వ లక్ష్యం..

‘రాష్ట్ర సంపదను ప్రజలకు సమానంగా పంచటమే ప్రభుత్వ లక్ష్యం’: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెల్గటూర్: రాష్ట్ర సంపదను ప్రజలకు సమానంగా పంచటమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రంలోని సంపదను ప్రజలకు సమానంగా పంచడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ఎడా పెడా దోచుకొని అప్పుల పాలు చేయటం కాదని గత ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చురకలు అంటించారు. సంపదను సృష్టించి ప్రజలకు సమానంగా పం చటమే సుపరిపాలన అవుతుందని ఎవరికి అందినంత వారు దోచుకోవటం కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ధర్మపురి పట్టణంలో ప్రభుత్వం మంజురు చేసిన రూ.265 కోట్ల అభివృద్ధిపనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మన్ కుమార్‌తో కలిసి బుధవారం కళాశాల మైదానంలో శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు ఆయన ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న విలువైన వనరులన్నింటినీ ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. సృష్టించి ప్రజలకు పంచడమే అని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25 ఎకరాల స్థలంలో..

ఇందులో భాగంగా పుట్టినవే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని గర్వంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 25 ఎకరాల స్థలంలో రూ. 200 కోట్ల అంచనా విలువతో నిర్మించబోయే యంగ్ ఇండియా స్కూల్లు ప్రపంచ స్థాయి మేధావులను తయారు చేసేందుకు ఉపకరిస్తాయన్నారు. సంపన్న వర్గాలతో పోటీపడే విధంగా అందులో చదువుకున్న విద్యార్థులు ఉంటారని అభిప్రాయ పడ్డారు. గతంలో ఏర్పాటు చేసిన గురుకులాలను ఎస్సీ, బీసీ మైనార్టీ ఎస్టీ అని విద్యార్థి స్థాయిలోనే విద్యార్థుల మెదల్లలో విష బీజాలు నాటి విడదీశారు. గురుకులాలు కులాల మతాల కుంపటి ని రాజేసే విధంగా పనిచేశాయని విమర్శించారు. ఇప్పుడు అలా కాకుండా అందరూ ఒక్క చోటే చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉండి సమాజ అభ్యున్నతికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అంత పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవసరమా? అని కొంతమంది పెదవి విరిచిన సీఎం రేవంత్ రెడ్డి నేను వెనక్కి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని శ్రీకారం చుట్టామన్నారు.

ఆయన ఆలోచనలు చూసి ముచ్చటేసింది..

దీని కోసం రూ. 22500 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ధర్మపురిలో నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మన్ చిన్న కార్యకర్త నుండి మంత్రి స్థాయికి ఎదిగిన తన బాధ్యతను మరువని వ్యక్తి, ఎన్నికల్లో గెలిచిన వెంటనే తమ వద్దకు వచ్చి తను నమ్ముకున్న ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మా ముందు వీటన్నిటిని ఉంచారు. సీఎంకు నాకు ఆయన ఆలోచనలు చూసి ముచ్చటేసింది. మంచి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చామని మేము సంతృప్తి పడ్డామన్నారు. దీంతో ధర్మపురి నియోజకవర్గానికి రూ.265 కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశామని బట్టి ప్రకటించారు. ఏ నియోజక వర్గానికి కూడా ఈ స్థాయిలో ఒకేసారి నిధులను విడుదల చేయలేదని స్పష్టం చేశారు. పాద యాత్రలో పేదలు పడుతున్న కష్టాలను చూసి ఆరు గ్యా రంటీలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇండ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది..

బిడ్డ గొడ్డు ఏడ ఉంటదని చెప్పి డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసింది .కట్టుకున్న వారికి ఐదు లక్షల ఇస్తుంది . కట్టుకున్న రీతిలో వారం వారం బిల్లులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టిందని గర్వంగా చెప్పుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లతో రాష్ట్రంలో పేదవాడి ఆత్మగౌరవం నిలబడిందన్నారు.ప్రజలతో తమ కు ఉన్న బంధం బాధ్యత ఇదే అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఖర్చుకు వెనుకాడకుండా ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని గుర్తు చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా రూ .26700 కోట్లు వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇచ్చామ న్నారు. అదే విధంగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలని అనుకున్నాము.

ఎవరెన్ని విమర్శలు చేసిన వెనక్కి తగ్గే పనేలేదు..

రైతు భరోసా, రుణమాఫీ సబ్సిడీలు, బోనస్ , యాంత్రీకరణ రూపంలో రైతులకోసం రూ .1లక్ష కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పారు. చేనేత సంక్షేమ విద్యుత్ విద్య వైద్య రంగాలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎవరెన్ని విమర్శలు చేసిన వెనక్కి తగ్గే పనేలేదని, పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసిన విధంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో సైతం ఆశీర్వ దించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని బట్టి చివరగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

READ MORE .....

భట్టికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది.. ఆ పేపర్ లో వచ్చిన కథనంపై దళిత సంఘాలు ఆగ్రహం

Next Story