భట్టికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది.. ఆ పేపర్ లో వచ్చిన కథనంపై దళిత సంఘాలు ఆగ్రహం

by Prasad Jukanti |   (  Updated:2026-01-21 11:52:43  IST  )

నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో భట్టిపై వచ్చిన కథనంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

భట్టికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది.. ఆ పేపర్ లో వచ్చిన కథనంపై దళిత సంఘాలు ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై (Bhatti Vikramarka) దుష్ప్రచారం జరుగుతోందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నైనీ బ్లాక్ టెండర్లపై (Naini Coal Block Tenders) ఓ దినపత్రికలో వచ్చిన కథనం శుద్ధ అబద్ధం అని ఖండించాయి. నైనీ బొగ్గుగని టెండర్ల విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. భట్టి విక్రమార్కపై ఆరోపణలు కుల దురహంకారమేనని తప్పుడు కథనం ప్రచురించిన సదరు సంస్థ ఎండీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. రాజకీయంగా ఎదిగిన దళిత లీడర్లను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండండి:

తప్పు జరిగితే ఎత్తి చూపడానికి మీడియాకు స్వేచ్ఛ ఉందని, అయితే ఊహించుకుని లేనిది ఉన్నట్లుగా రాయడం సరికాదన్నారు. ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిదన్నారు. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ వేసిన వారిని డిస్ క్వాలిఫై చేశారన్నది అవాస్తం అని భట్టిని అవమానిస్తున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన వాళ్లకు టెండర్ దక్కేలా కుట్ర పన్నారన్నది అవాస్తవం అన్నారు. ఫీల్డ్ విజిట్ చేసిన సంస్థకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే సంబంధిత అధికారిని జైల్లో పెడతారని చెప్పారు. సీఎం దగ్గరే సింగరేణి ఉంటుందన్నది అవాస్తవం అని చెప్పారు.

READ MORE .....

‘రాష్ట్ర సంపదను ప్రజలకు సమానంగా పంచటమే ప్రభుత్వ లక్ష్యం’: డిప్యూటీ సీఎం భట్టి

Next Story