- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌశిక్ ఒంటెద్దు పోకడలు తిరుగుబాటుకు కారణమా..?
సీనియర్లను పక్కకు బెట్టి అనామకులకు స్థానం కల్పిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సీనియర్లు మండిపడుతున్నారు.

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మితిమీరిన చర్యలు.. ఒంటెద్దు పోకడలు పార్టీ పతనానికి కారణమవుతున్నాయని కొంతమంది భావిస్తున్నారు. రానున్న కాలంలో పార్టీలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు కౌశిక్ తీరుతో బయటి పార్టీల వైపు చూసే అవకాశం ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి మొదట సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో పార్టీలో తనదే రాజ్యం అని ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం తనకు లేదని భావిస్తూ.. సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లకు స్థానం కల్పించడం ఈ తిరుగుబాటుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. మొదటినుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో నోటి దురుసు సైతం ఎక్కువై అధికారులను, పత్రికా ప్రతినిధులను, తన తోటి రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది.
హుజురాబాద్‌ను నట్టేట ముంచుతున్నాడు..
హుజురాబాద్ నియోజకవర్గంలో మొదటినుంచి బీఆర్ఎస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కౌశికిరెడ్డి వ్యవహరిస్తున్న శైలిని బట్టి పార్టీతీరు గమన దశలో పయనిస్తుందని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ హుజురాబాద్‌ను నట్టేట ముంచుతున్నాడని సీనియర్లు వాపోతున్నారు. పార్టీలో తనకు తిరుగు లేదని, అధినాయకత్వం తాను ఏది చెబితే అదే జరుగుతుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు అండగా ఉన్నారని భావిస్తూ కిందిస్థాయి క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతో పాటుగా వారిని చులకనగా మాట్లాడుతున్నాడని, ఈ దశలో వారు తమ ప్రాధాన్యత కోల్పోతూ కింది స్థాయి కార్యకర్తల మద్దతు కోల్పోయి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని అంటున్నారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే మేలు..
మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ఉన్న సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చినప్పటికీ గెలుపుకు సహకరించకుండా బయటికి పార్టీ అభ్యర్థులకు సహకారం అందించాడని అంటున్నారు. దీంతో తాము పార్టీలో ఉండి అచేతానావస్థలో ఉండే కన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే మేలని భావించి ఒక ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్లడానికి తగిన వ్యూహం రచించుకోవడం జరిగిందని తెలుపుతున్నారు. తమ ఎజెండా కౌశిక్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం తప్ప పార్టీ మారడం కాదని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో సర్వే పేరిట చాలామంది నాయకులకు టికెట్లు ఇవ్వకుండా దూరం పెట్టి పార్టీ పతనానికి కారణం అయిన కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తన వ్యక్తిగత పంచాయతీని పార్టీపై ...
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వ్యక్తిగత పంచాయితీని పార్టీపై రుద్దుతూ పార్టీ పతనానికి కారణం అవుతున్నాడని చాలామంది కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర వివాదాన్నీ అడ్డం పెట్టుకొని అధికారులతో పంచాయితీ పెట్టుకోవడమే కాకుండా అసలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారుల వద్దకు వెళ్లకుండా చేస్తున్నారని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొంతమంది నాయకులు చెబుతున్న చెప్పుడు మాటలు విని చాలామంది నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తున్నాడని వారు ఆరోపించారు. సెకండ్ క్యాడర్ అంటే విలువ ఇవ్వని కౌశిక్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి తాము రహస్య సమావేశం పెట్టుకోవడం జరిగిందని, ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని వారు తేల్చి చెప్పారు.
పార్టీ మారేది లేదు...
తమ పంచాయతీ కేవలం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై మాత్రమే అని, పార్టీపై కాదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆర్ ఎవరైనా నాయకుని పార్టీలో తీసుకొని వీరే మీ నాయకుడు అని అంటే... అతని కింద పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామే తప్ప ఈ కౌశిక్ రెడ్డి బాధ భరించలేమని స్పష్టం చేశారు.






