- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరు కాదు అర గ్యారెంటీ అమలు కాలే.. ప్రైవేట్ బిల్లుకు రెడీ: కేటీఆర్
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరు గ్యారెంటీలకు (6 Guarantees) చట్టబద్దత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు (Private Member Bill) ప్రవేశపెట్టబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్‍ను కోరుతున్నామన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారు. అభయహస్తం అనే దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారెంటీలపై సంతకం జరిగిందని చెప్పించారు. కానీ ఆరు గ్యారెంటీలపై సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని ఆరోపించారు.
అర గ్యారెంటీ అమలు కాలేదు:
NTR టైమ్‍లో ప్రైవేట్ బిల్లు ఆమోదించి చట్టం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. మా బిల్లు చట్టమైతే కచ్చితంగా మహిళలకు రూ.2500, రూ.4 వేలు, రైతుభరోసా రూ.15 వేలు, విద్యార్థులకు విద్య భరోసా కార్డులు, వంటి మొదలైన హామీలన్నీ హక్కుగా వస్తాయన్నారు. మేం పెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని ఎద్దేవా చేశారు.






