13 తులాల బంగారం పోగొట్టుకున్న యువకుడు

by Elthuri vijay kumar |

హుజురాబాద్ మండలంలో ని రంగాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు 13 తులాల బంగారాన్ని పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

13 తులాల బంగారం పోగొట్టుకున్న యువకుడు
X

13 తులాల బంగారం పోగొట్టుకున్న యువకుడు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

దిశ,హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలంలో ని రంగాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు 13 తులాల బంగారాన్ని పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోయిన బంగారంతో పాటు సీతాఫలాలతో ఉన్న సంచి కోసం యువకుడు గాలింపు చర్యలు చేపట్టి, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిబోయిన రమేష్ హన్మకొండ జిల్లాలోని వేలేరు గ్రామం నుంచి తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ప్రయాణానికి ముందు అతను 13 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని సీతాఫలాలను ఒక సంచిలో ప్యాక్ చేసి తన బైక్‌కు తగిలించుకున్నాడు.

వేలేరు నుంచి బయలుదేరిన తర్వాత హుజురాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామం వరకు ఆ సంచి బైక్‌కు అలాగే ఉంది. కానీ ఆ గ్రామం దాటిన తర్వాత సంచి పోయినట్లు రమేష్ గుర్తించాడు. వెంటనే అతను దారి వెంట వెనక్కి వెళ్లి వెతికాడు, కానీ ఆ సంచి ఆచూకీ లభించలేదు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన తర్వాత రెండు రోజుల పాటు రమేష్ తాను ప్రయాణించిన మార్గంలో గాలించాడు. అయినా సంచి దొరకకపోవడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బంగారు ఆభరణాలు మరియు సీతాఫలాలు ఉన్న సంచిని ఎవరైనా కనుగొంటే, హుజురాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story