- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా రాజకీయ పరిణామాలపై ధ్వజమెత్తారు. ఇటీవల చోటుచేసుకున్న పార్టీ మార్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా రాజకీయ పరిణామాలపై ధ్వజమెత్తారు. ఇటీవల చోటుచేసుకున్న పార్టీ మార్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం, హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై జరుగుతున్న ప్రచారంపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి ఒక పచ్చి సమైక్యవాది అని, ఆయన ఎప్పుడూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని కవిత మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే చాలు, మాకు తెలంగాణ అక్కర్లేదు అన్న వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తితో రాజకీయ పునరేకీకరణ ఎలా సాధ్యమవుతుంది? అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో మహిళలకు ప్రాధాన్యత ఉండదని, వెయ్యి ఏళ్లయినా బీఆర్ఎస్ పార్టీ తీరు మారదని ఆమె వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ధ్వజం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి న్యాయస్థానాలపై నమ్మకం లేదని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సభలు కేవలం బల ప్రదర్శన కోసమే తప్ప, వాటి వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె హితవు పలికారు. హరీష్ రావున 'గుంటనక్క' అని సంబోధిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. "హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో నాకు తెలుసు, నువ్వు చెబుతావా.. నన్ను చెప్పమంటావా?" అని హరీష్ రావుకే సీఎం ఆఫర్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ రావు పర్యటన వెనుక ఉన్న కారణం సీఎంకు నిజంగా తెలిస్తే, ఆ విషయాన్ని నేరుగా ప్రజలకే చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగదని.. తప్పకుండా ప్రత్యామ్నాయం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.






