కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం.. కమ్యూనిస్టుల తరహాలో పోరాటానికి శ్రీకారం

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-31 06:18:32  IST  )

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు.

కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం.. కమ్యూనిస్టుల తరహాలో పోరాటానికి శ్రీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంటి స్థలాల హామీని డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చకుంటే భూ పోరాటాలకు చేస్తామని ఇదివరకే కవిత స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టింది. కమ్యూనిస్టు పార్టీల తరహాలో భూ పోరాటం ఆరంభించింది. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని.. అడ్డుంకులు ఉద్యమం ఆగదని కవిత కీలక ప్రకటన చేశారు. కాగా, ఇప్పటికే కవిత ‘జాగృతి జనంబాట యాత్ర’ పేరుతో యాత్ర చేస్తున్నారు. అక్టోబరు 25వ తేదీన నిజామాబాద్‌లో జనంబాట ప్రారంభించిన విషయం తెలిసిందే.

READ MORE ....

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత

Next Story