- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు సంవత్సరం కాలంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) సంబంధించిన బిల్లు సంవత్సరం కాలంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంపై జాగృతి అధ్యక్షురాలు (Jagruti President) కల్వకుంట్ల కవిత (Kalvakuntla' Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణలోని 52 శాతం బీసీ జనాభా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లు ఆమోదం పొందేలా చూడాలని, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆమె సూచించారు. సంవత్సరానికి పైగా బిల్లు పెండింగ్‌లో ఉండటం బీసీల హక్కులకు భంగం కలిగించడమేనని, ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా న్యాయపోరాటం చేయాలని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత నొక్కి చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల ప్రక్రియను స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
READ MORE ....
కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం.. కమ్యూనిస్టుల తరహాలో పోరాటానికి శ్రీకారం






