తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. ఎన్టీఆర్ జయంతి వేళ జూ.ఎన్టీఆర్ భావోద్వేగం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-28 04:53:49  IST  )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) 102వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు.

తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. ఎన్టీఆర్ జయంతి వేళ జూ.ఎన్టీఆర్ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) 102వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (JR NTR), ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), ఎన్టీఆర్ కుమారుడు, నటుడు- రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, ఆయనకు నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిశ్చలంగా నిలబడి, పూలమాలలు వేసి తమ గౌరవాన్ని తెలియజేశారు. బాలకృష్ణ కూడా తన తండ్రి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి, ఎన్టీఆర్ సినిమా, రాజకీయ రంగాలలో చేసిన కృషిని స్మరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తూ, "యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన సినిమా, రాజకీయ రంగాలలో చేసిన సంస్కరణలు తరతరాలకు స్ఫూర్తి" అని Xలో పోస్ట్ చేశారు.

జూ.ఎన్టీఆర్ సైతం తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను.." అని ఆ పోస్ట్ లో రాశారు. జూ.ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ అందరి హృదయాలను హత్తుకునేలా ఉందని, జోహార్ ఎన్టీఆర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక

Next Story