- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస
‘దిశ’ మహానాడు ప్రత్యేక సంచికను ఉదయం ఆన్ లైన్‌లోనే చదివేశాను, ఈ ప్రత్యేక సంచిక చాలా బాగా తీసుకొచ్చారు.

దిశ, ప్రతినిధి కడప: ‘దిశ’ మహానాడు ప్రత్యేక సంచికను ఉదయం ఆన్ లైన్‌లోనే చదివేశాను, ఈ ప్రత్యేక సంచిక చాలా బాగా తీసుకొచ్చారు. యాజమాన్యానికి, పాత్రికేయులకు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడులో మొదటి రోజైన మంగళవారం మహానాడు కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు ‘దిశ’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు కడపలో జరుపుకుంటున్న సందర్భంగా ‘దిశ’ యాజమాన్యం తెలుగుదేశం పార్టీ ప్రస్థానం, విజయాలు, ప్రజల హృదయంలో చెరగని ముద్ర వేసిన ఘట్టాలను విపులీకరిస్తూ ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఈ సంచికను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని పాఠకులకు చాలా బాగా అందిస్తూ ప్రచురించిన దిశకు అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. దిశ ఏపీ బ్యూరో చీఫ్ రొద్దం శ్రీనివాస్‌తో పాటు ఏజీఎం గట్టు ప్రదీప్ కుమార్(టీజీ), సీనియర్ మేనేజర్ రామక్రిష్ణ చౌదరి (ఏపీ) ప్రత్యేక సంచికను చంద్రబాబు వద్ద ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంచిక కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






