- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: కౌంటింగ్ హాల్‍లో గందరగోళం.. నిరసనకు దిగిన ఏజెంట్లు
జూబ్లీహిల్స్ కౌంటింగ్ కేంద్రంలో సరైన ఏర్పాట్లు చేయలేదని ఏజెంట్లు నిరసనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా కౌంటింగ్ హాల్‍లో గందరగోళం ఏర్పడింది. అభ్యర్థుల తరఫున ఏజెంట్ల కోసం సీటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఏజెంట్లు నిరసనకు దిగారు. సరైన ఏర్పాట్లు కూడా చేయలేరా అంటూ పలువురు అభ్యర్థుల ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. కాగా కాసేపటి క్రితమే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‍పేట డివిజన్ ఈవీఎం లెక్కింపు మొదలు పెట్టగా తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
Read More..
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. అధికార పార్టీకి స్వల్ప ఆధిక్యం
Next Story






