తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పోటీ

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-06 12:51:19  IST  )

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. జిల్లా వారీగా పోటీ చేస్తున్న వార్డుల వివరాలు ప్రకటించింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పోటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. జిల్లా వారీగా పోటీ చేస్తున్న వార్డుల వివరాలు ప్రకటించింది. దీనికి సంబంధించి పార్టీ అభ్యర్థులు బీఫామ్ లు దాఖలు చేయగా స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్ లను ఆమోదించినట్టు తెలిపింది. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల‌ని కోరింది. ఇక మొత్తం 11 జిల్లాల్లో జ‌న‌సేన బ‌రిలో దిగుతుండ‌గా అత్య‌ధికంగా క‌రీంన‌గ‌ర్ లో 56మంది పోటీ చేస్తున్నారు. అత్య‌ల్పంగా మ‌హ‌బూబాబాద్ లో 5గురు పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తార‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించ‌గా తాజాగా నేడు అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ ప‌ర్య‌ట‌న క్యాన్సిల్ చేసుకున్న‌ట్టు తెలిపారు.

తెలంగాణ పుర పోరులో జనసేన గాలి వీస్తుందా?

Next Story