సాయంత్రం జనసేన తెలంగాణ సంకల్ప సభ..? నేతలకు పార్టీ కీలక సూచనలు

by Ramesh Naini |   (  Updated:2026-06-02 08:48:35  IST  )

జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

సాయంత్రం జనసేన తెలంగాణ సంకల్ప సభ..? నేతలకు పార్టీ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సభ అనుమతి కోసం జనసేన పార్టీ ఇవాళ హైకోర్డులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తెలంగాణ జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్ర జనసైనికులారా.. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు నిన్న సాయంత్రం పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపింది. ఈ సభ నిర్వహణకు అనుమతి కోసం జనసేన పార్టీ తెలంగాణ విభాగం వారు ఈ రోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది.

హైకోర్టు వారు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే యధావిధిగా సాయంత్రం సభ నిర్వహించడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ సభకు గౌరవ హైకోర్టు వారు అనుమతి నిరాకరించిన పక్షంలో జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారని పేర్కొంది. కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ ఏర్పాటు చేయాలని జనసేన భావించింది. అయితే ఇందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.

TG: తగ్గని పవన్ కల్యాణ్.. ప్లాన్ చేంజ్: ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్

Next Story