ఐపీఎల్: కొత్త రూపం దాల్చిన బెట్టింగ్ దందా.. ఫామ్ హౌస్‌లు, ఆఫ్‌లైన్‌పై ప్రత్యేక నిఘా: సీపీ సజ్జనార్

by Ramesh Naini |   (  Updated:2026-03-28 14:46:29  IST  )

ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఐపీఎల్: కొత్త రూపం దాల్చిన బెట్టింగ్ దందా.. ఫామ్ హౌస్‌లు, ఆఫ్‌లైన్‌పై ప్రత్యేక నిఘా: సీపీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చిందని తెలిపారు. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉందని వెల్లడించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండని వెల్లడించారు.

మరణంలోనూ మహోన్నతం: ఆరుగురికి ప్రాణదాతగా నిలిచిన నల్గొండ యువకుడికి సీపీ సజ్జనార్ సెల్యూట్!

Next Story