- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణంలోనూ మహోన్నతం: ఆరుగురికి ప్రాణదాతగా నిలిచిన నల్గొండ యువకుడికి సీపీ సజ్జనార్ సెల్యూట్!
నల్గొండ యువకుడు హరీష్ అవయవ దానంతో ఆరుగురికి పునర్జన్మ. పుట్టెడు శోకంలోనూ సామాజిక బాధ్యత చాటుకున్న తల్లికి సజ్జనార్ సెల్యూట్

దిశ, వెబ్ డెస్క్: మరణంలోనూ మహోన్నతంగా ఆలోచించి ఆరుగురికి ప్రాణదాతగా నిలిచిన నల్గొండ యువకుడు, కుటుంబ సభ్యులకు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) సెల్యూట్ చేశారు. అవయవదానంపై స్పందిస్తూ.. "ప్రాణం పోయాక కూడా మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపి, మానవత్వాన్ని చాటుకున్నాడు నల్గొండకు చెందిన యువకుడు. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన బత్తిని హరీష్ (Harish) అవయవ దానం (Organ donation) ద్వారా ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించాడు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ (IPS officer Sajjanar) హరీష్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని కొనియాడారు.
అలాగే నల్గొండ జిల్లాకు చెందిన హరీష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. కళ్ల ముందే కొడుకు విగతజీవిగా పడి ఉన్నా, ఆ పుట్టెడు శోకం లో ఆయన తల్లి మహేశ్వరి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తన బిడ్డ ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటూనే, హరీష్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. హరీష్ కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లను దానం చేయడం ద్వారా మొత్తం ఆరుగురు బాధితులకు కొత్త జీవితం లభించారు.
ఈ మహోన్నత కార్యంపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. "తమ బిడ్డను మరో ఆరుగురి రూపంలో బతికించుకోవాలని హరీష్ తల్లి తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత స్ఫూర్తిదాయకం. మరణానంతరం కూడా తోటి మనుషుల జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ త్యాగం చిరస్మరణీయం. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆ కుటుంబానికి నా సెల్యూట్" అని ఆయన పేర్కొన్నారు. అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ హరీష్ కుటుంబం చేసిన ఈ త్యాగం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది.






