నా షరతులను ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా.. సోనమ్ వాంగ్‍చుక్ సంచలన లేఖ

by Prasad Jukanti |   (  Updated:2026-07-20 06:48:37  IST  )

సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమణకు 3 షరతులు విధించారు.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ 'చలో సంసద్' మార్చ్‌ ఢిల్లీలో హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది.

నా షరతులను ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా.. సోనమ్ వాంగ్‍చుక్ సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థలో వైఫల్యాలపై గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించడానికి మూడు షరతులను విధించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఆయన చేతిరాతతో రాసిన ఒక లేఖను తాజాగా ఆయన ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తన షరతులను నెరవేరిస్తే ఈరోజే దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మూడు డిమాండ్లు ఇవే:

ఇటీవల జరిగిన నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీలతో సహా దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సోనమ్ డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజీల అంశాన్ని పార్లమెంట్‌లో ఖచ్చితంగా లేవనెత్తుతామని రాజకీయ నాయకులు తనకు హామీ ఇవ్వాలన్నారు. అరోగ్యం పరిస్థితి దృష్ట్యా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించ తలపెట్టినపార్లమెంట్ మార్చ్‌లో తాను పాల్గొనలేకపోతే, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి పైన పేర్కొన్న షరతులపై తనకు స్వయంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో సెక్యూరిటీ టైట్:

మరొవైపు ఇవాళ పార్లమెంట్ మార్చ్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో సంసద్ కార్యక్రమానికి అనుమతి లేదని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లను దాటుకుని వెళ్లేై ప్రయత్నం చేయగా వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు, సీజేపీ నిరసన కారుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది. దీంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. మరోవైపు ఢిల్లీలోని మెట్రో, జేఎన్‍యూ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసిన అనంతరమే వాహనాలను అనుమతి ఇస్తున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్

Next Story