- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు 45 వేల మెజారిటీ పక్కా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో తామంటే తామే గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో తామంటే తామే గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని అన్నారు. 45 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని అన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, 1,94,631 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 48.49గా నమోదైంది. ఓటింగ్ 407 పోలింగ్ బూత్‌లలో జరిగింది. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొదట షేక్‌పేట్ (Shaikpet) డివిజన్ ఓట్లు లెక్కించి, ఆ తర్వాత వరుసగా మిగతా 6 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు.
Read More..
Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ షురూ
కాసేపట్లో జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. హార్ట్ ఎటాక్‌తో అభ్యర్థి మృతి






