- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో పుకార్లు.. ప్రజలు ఆగం ఆగం..
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ముడి సరుకుల రవాణా కొంత కష్టంగా ఉన్నది వాస్తవమే కానీ, మరింత దారుణ పరిస్థితులు లేవని సంబంధిత ఉన్నతాధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఆందోళన చెందవద్దని సమాచారం ఇస్తూనే ఉన్నారు.

దిశ, జూబ్లీహిల్స్: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ముడి సరుకుల రవాణా కొంత కష్టంగా ఉన్నది వాస్తవమే కానీ, మరింత దారుణ పరిస్థితులు లేవని సంబంధిత ఉన్నతాధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఆందోళన చెందవద్దని సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా, ప్రధాన మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యమైన ఉన్నతాధికారులు చెప్పిన విషయాలను గ్రహించకుండా, సోషల్ మీడియాలో అనామకులు, ఇన్ఫ్లుయెన్సర్లు వారి వ్యూస్ కోసం, స్వప్రయోజనాల కోసం ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ పుకార్లు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మి ప్రజలు పానిక్ అవుతూ, ఇతరులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఇదే తరహాలో మొన్నటి వరకు గ్యాస్ కొరత అంటూ ప్రచారం జరగగా, ఇప్పుడు పెట్రోల్ కొరత అంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. "ఈరోజే చివరి రోజు, ఇక పెట్రోల్ దొరకదు" అనే వార్తలను నమ్మి ప్రజలు అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఉద్యోగాలకు వెళ్లేవారికి, అత్యవసర సేవల కోసం బయటకు రావాల్సిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద 2-3 కిలోమీటర్ల మేర కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు క్యూలలో నిలుస్తున్నాయి. అత్యవసరం లేకపోయినా ప్రజలు పెట్రోల్ కోసం బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఒక చోట అయితే భార్యాభర్తలు పెట్రోల్ తీసుకెళ్లడానికి సరైన డబ్బా లేకపోయినా స్టీల్ పాత్రలో పోసుకుని, తలపై పెట్టుకుని వెళ్లిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇది వినడానికి నవ్వు తెప్పించినా, ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.
అతి జాగ్రత్త కూడా ప్రమాదమే మిత్రమా..! కాస్త ఆలోచించండి.
ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, అలాగే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దు. పెట్రోల్ కొరత లేదు, ఎల్‌పీజీ గ్యాస్ కొరత కూడా లేదు. మన వద్ద సరిపడినంత నిల్వలు ఉన్నాయి అని అధికారికంగా ప్రకటించారు. ప్రజలందరూ ఒకేసారి రోడ్లపైకి రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా పుకార్లను నమ్మకుండా శాంతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. నగరవాసులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్






