డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని, రెండునెలలకు సరిపడా నిల్వలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడమే కాక.. డ్రమ్ములు, క్యాన్లు, కంటైనర్లలోనూ పెట్రోల్, డీజిల్ ను నింపుకుంటున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో బంకుల్లో ఇంధనం నిండుకుని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. వాణిజ్య గ్యాస్ కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనని, దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. హైదరాబాద్ లో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు.

Next Story