నిమ్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-28 15:12:38  IST  )

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

నిమ్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు
X

దిశ, ఖైరతాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓపీ బ్లాక్‌లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఫార్మసీ, శాంపిల్ కలెక్షన్ ల్యాబ్‌లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. పేషెంట్లతో ఆప్యాయతతో పలకరించి, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు, సేవల కల్పనపై సూచనలు చేశారు. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గద్దర్ సతీమణి విమలమ్మను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

HYD: ఎమ్మెల్యేల ఆటలు.. బొక్కబోర్లాపడ్డ ఆది శ్రీనివాస్ (వీడియో)

Next Story