- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి హరీశ్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారిస్తున్నారనే ప్రచారాన్ని నమ్మొద్దు : హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారిస్తున్నారనే అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.

దిశ, జూబ్లీహిల్స్ : తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారిస్తున్నారనే అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావును మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి ప్రశ్నించినట్టు తెలిపారు. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున, హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), మంగళవారం విచారణను ముగించి ఆయన వెళ్ళేందుకు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేసినట్టు తెలిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10.03.2024 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. " సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More..






