మా దృష్టికి వచ్చింది.. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు సీపీ సజ్జనార్ మరో హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2026-01-17 07:26:58  IST  )

సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మా దృష్టికి వచ్చింది.. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు సీపీ సజ్జనార్ మరో హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రీల్స్‌లో ఆడంబరమైన బిల్డప్ ఇచ్చి, రియాలిటీలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు వంటి విలువైన బహుమతులు ఇస్తామంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు.

చట్టప్రకారం చర్యలు తప్పవు..

అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తూ నిండా ముంచుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తప్పవని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ తరహా మోసాలపై ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్–1978 (The Prize Chits and Money Circulation Schemes (Banning) Act-1978) ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్‌లైన సరే ఎవరికీ మినహాయింపు ఉండదని సీపీ తేల్చిచెప్పారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న లక్కీ డ్రా రీల్స్ పోస్ట్ చేశారు.

Read More... Tragedy: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. తల్లితో పాటు ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి

Next Story