- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. తల్లితో పాటు ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నంద్యాల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నంద్యాల (Nandyal) పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్జీవో కాలనీ (NGO Colony)లోని ఓ ఇంట్లో నివాసం ఉండే మల్లిక (26), ఇషాన్ సాయి (2), ఏడు నెలల పసికందు విగత జీవులుగా పడి ఉండటాన్ని కాలనీవాసులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, వారి మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా చంపేశారా..? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
Read More... పుణ్యం వస్తుందనే ఆ కులాల స్త్రీలపై అత్యాచారాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Next Story






