గ్రూప్‌- 1 నియామకాలపై హైకోర్టు తీర్పు.. సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-05 10:39:49  IST  )

రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 (Group-1) నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వెలువరించిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

గ్రూప్‌- 1 నియామకాలపై హైకోర్టు తీర్పు.. సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 (Group-1) నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వెలువరించిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ తీర్పును ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించారు. నిరుద్యోగుల కల సాకారం అయ్యే దిశగా ఇదొక గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని విమర్శించారు. కానీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా.. చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఇక గ్రూప్-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భర్తీ అవుతున్న తొలి గ్రూప్-1 అధికారులు మీరే అంటూ సీఎం అభ్యర్థులను ఉద్దేశించి కామెంట్ చేశారు.

సీఎం రేవంత్ సర్టిఫికెట్ వెనక్కి తీసుకోండి.. హార్వర్డ్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ నేత, పూర్వ విద్యార్థి లేఖ

Next Story