- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో భారీ వర్షం.. తెలంగాణ జిల్లాలకు అలర్ట్
గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్నిప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోయింది.
మరోవైపు రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగుల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.
Read More..
Next Story






