- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంచికొట్టిన వాన.. నగరం జలమయం
ఈసారి వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : ఈసారి వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది. దీంతో నగరం దాదాపు జలమయం అయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చందానగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, అల్వీన్ కాలనీ, హైదర్ నగర్ లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, ఇళ్లలోకి నీరు చేరడంతో తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎక్కడిక్కడ నాలాల్లో చెత్త పేరుకు పోవడం తో వర్షపు నీరు రోడ్లపై, ఇళ్లలోకి చేరింది. ఇటీవల చిన్నపాటి వర్షానికి నీట మునిగిన శేరిలింగంపల్లి రైల్వే అండర్ పాస్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన విషయం తెలిసిందే.
అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో లింగంపల్లి అండర్ పాస్, చందానగర్ అండర్ పాస్ లు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. చందానగర్ లోని వేమన కాలనీ, శంకర్ నగర్, అమీన్పూర్ రోడ్డు ప్రాంతాల్లో పలు దుకాణాలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. శేరిలింగంపల్లి, తారా నగర్, గోపి నగర్ లలోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి. అల్వీన్ కాలనీ డివిజన్ లో ఎల్లమ్మబండ, సిక్కు బస్తీ, మాదాపూర్ లో దుర్గం చెరువు, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్ మెయిన్ రోడ్డు, హఫీజ్ పేట్ లలో రహదారులపై నీళ్లు చేరింది. ఇంత వర్షం కురిసినా ఎక్కడ కూడా మాన్ సూన్ టీమ్ ల జాడేలేదు. ముందస్తుగా మాన్ సూన్ టీమ్ లను రెడీ చేశామని చెప్పిన జీహెచ్ఎంసీ అధికారులు తీరా ప్రజల ఇబ్బందులు సమయంలో మాత్రం కనపడకుండా పోయారు.






