- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్-బెంగళూరు హైవేపై భారీగా పొగమంచు.. 10 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (NH 44)పై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (NH 44)పై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 5 గంటల నుంచే మంచు తీవ్రత పెరగడంతో లో విజిబిలిటీ ఏకంగా సున్నాకు పడిపోయింది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనే భయంతో లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాలను డ్రైవర్లు శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు రోడ్డు పక్కనే నిలిపివేశారు. దీంతో శంషాబాద్ నుంచి దాదాపు 10 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి.
ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల అష్టకష్టాలు..
తాజా పరిణామంతో శంషాబాద్ విమానాశ్రయానికి (RGIA) వెళ్లాల్సిన ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. సమయానికి తమ ఫ్లైట్‌లను అందుకోలేమేమోనని తీవ్ర ఆందోళనతో చాలామంది ప్రయాణికులు ట్యాక్సీల నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎంట్రీ పాయింట్ల వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఫాగ్ లైట్లు ఉన్న వాహనాలను ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
Read More..
మంచు గుప్పిట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్.. పలు విమానాల రద్దు, ప్రయాణికుల పడిగాపులు






