వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. ఢిల్లీ టూర్ లో Governor - Dr. Tamilisai Soundararajan

by GSrikanth |   (  Updated:2022-08-24 07:08:36  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయం అట్టుడుకుతోంది.

వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. ఢిల్లీ టూర్ లో Governor - Dr. Tamilisai Soundararajan
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆమె హస్తినకు చేరుకున్నారు. ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గవర్నర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర మంత్రులతో గవర్నర్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇచ్చేలా చూడాలని, ఆయనకు తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైని మంగళవారం కోరారు. బీజేపీ నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే ఆమె ఢిల్లీ టూర్ కొనసాగడం హాట్ టాపిక్ అయింది. సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు చేసిన లిక్కర్ స్కామ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశంలో కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బీజేపీ నిరసనలు, ఆరోపణలు ఓ వైపు, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు మరో వైపు ఉత్కంఠగా మారుతున్న తరుణంలో తమిళిసై హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రుల్లో ఎవరెవరిని కలవబోతున్నారు, ఎలాంటి చర్చలు జరగబోతున్నాయని అనేది హాట్ టాపిక్ అవుతోంది.

మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. TRS కౌన్సిలర్ రాజీనామా

Next Story