తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు: బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-30 07:49:24  IST  )

సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను (Hate Speech) అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది.

తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు: బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను (Hate Speech) అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు, పౌర హక్కుల అంశాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ (Select Committee) కి రిఫర్ చేస్తూ తీర్మానం చేసింది. సోషల్ మీడియా, బహిరంగ సభల్లో కొందరు వ్యక్తులు మతపరమైన, కులపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్న నేపథ్యంలో, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక బిల్లును రూపొందించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారికి భారీ జరిమానాతో పాటు, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద జైలు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు.. ఇంటర్నెట్ వేదికగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులతో పాటు కొందరు అధికార పార్టీ సభ్యులు కూడా కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోతే, పోలీసులు దీనిని రాజకీయ కక్షసాధింపులకు వాడుకునే ప్రమాదం ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ బిల్లును హడావిడిగా ఆమోదించడం కంటే సమగ్రంగా చర్చించడం మంచిదని భావించింది. ఈ మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గవర్నర్ వద్దకు మంత్రి పొంగులేటి వ్యవహారం!.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

Next Story