మీలా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 16:17:53  IST  )

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) కౌంటర్‌ ఇచ్చారు.

మీలా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపించామని అన్నారు. అయినా ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్‌ రావు విమర్శించారు. మీలా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌లో అన్ని వాస్తవాలు చెప్పామని అన్నారు. కమీషన్ల కోసం పనులు మొదలుపెట్టి వదిలేయడం మీ అలవాటు. ఐదేళ్లలో మేడిగడ్డలో 162 TMCలే ఎత్తిపోశామంటున్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీటి గురించి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ మంత్రి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం మానుకోవాలని హరీష్‌ రావు హితవు పలికారు.

అంతకుముందు మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెబుతున్నారని.. ఆ బ్యారేజీ ఐదేళ్లలో కేవలం 162 టీఎంసీలే ఎత్తిపోశారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అవాస్తవిక ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. 2019-20లో 61 టీఎంసీలు, 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33 టీఎంసీలు, 2022-23లో 25.97 టీఎంసీలు, 2023-24లో 8.93 టీఎంసీల నీరు కలిపి 162 టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని ఉత్తమ్ తెలిపారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలని, ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్ నీట మునిగిందని, అదే సంవత్సరం కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్ హౌస్ బ్రెస్ట్ వాల్ కూలిందని, పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆ సంవత్సరం 25 టీఎంసీలే ఎత్తిపోశారని, 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు.


‘మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు ఈ దుస్థితి’.. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్

Next Story