- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే మాట్లాడుతా.. కవిత ఆరోపణలపై హరీష్ రావు!
ప్రస్తుతం హరీష్ రావు తన కూతురి అడ్మిషన్ కోసం అమెరికాలో ఉండగా అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరవాతనే మాట్లాడతానని అన్నారు. దయచేసి ఇప్పుడు ఏమీ అడగవద్దని రిక్వెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని, తమ కుటుంబాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం హరీష్ రావు తన కూతురి అడ్మిషన్ కోసం విదేశాల్లో ఉండగా అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది.
కానీ ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరవాతనే మాట్లాడతానని అన్నారు. రిపోర్టర్ మళ్లీ మళ్లీ అడిగినా మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన సిబ్బంది సైతం ఇండియా వెళ్లిన తరవాత మాట్లాడతారు అంటూ మీడియాను బుజ్జగించారు. అయితే ఈరోజు కాకపోయినా రేపు అయినా హరీష్ రావు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందే. లేదంటే కవిత వ్యాఖ్యలకు బలం చేకూరే అవకాశం ఉంది.
కాబట్టి ఇండియాకు వచ్చిన తరవాత హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరవాత నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ కాబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read More..
రాసి పెట్టుకోండి.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: హరీశ్‌రావు హాట్ కామెంట్స్






