- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాసి పెట్టుకోండి.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: హరీశ్‌రావు హాట్ కామెంట్స్
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వం పెద్ద రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వం పెద్ద రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక వానాకాలంలో కరెంట్ డిమాండే ఉండదని.. ఈ సమయంలోనే బాహుబలి మోటార్లతో నీటిని రిజర్వాయర్లలోకి ఎత్తిపోసుకోవచ్చని అన్నారు.
హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని హరీశ్ రావు కామెంట్ చేశారు. అందుకే రాష్ట్రంలో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేరని ఆరోపించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం రాసిపెట్టుకోండని కామెంట్ చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడాల్సిన ప్రభుత్వం కమిషన్లు, ఎక్వైరీలు అంటూ కాలం గడుపతోందని అన్నారు. ఏ పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాలన చూశాకే.. ప్రజలకు కేసీఆర్ విలువ ఏంటో తెలిసిందని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనకబడిందని కామెంట్ చేశారు.
Read More..






