కవితతో బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం.. గులాబీ నేతల వరుస భేటీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-05 03:57:01  IST  )

కల్వకంట్ల కవిత ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి

కవితతో బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం.. గులాబీ నేతల వరుస భేటీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కల్వకంట్ల కవిత ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం సీన్ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్లు మారిపోయింది. సోషల్ మీడియాలో ఇరువర్గాల టీంలు పోటీపడి మరీ పోస్టులు పెడుతున్నాయి. మరో వైపు.. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో వరుసగా ప్రెస్‌మీట్‌లు పెడుతూ కవిత వైఖరిని తప్పుపడుతున్నారు. ఇటు.. కవిత అప్‌డేట్స్ పేరిట ‘ఎక్స్’లో ఆసక్తికరమైన పోస్టులు వస్తూనే ఉన్నాయి.

భవన్‌లో వరుసగా మీటింగులు

తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం నుంచి మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కవితను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఆమె ఆరోపణలు, వ్యాఖ్యలు అర్థరహితమని, దురదృష్టకరమంటూ చెప్పుకొచ్చారు. ఇక కవిత అనుచరులు సైతం సోషల్ మీడియాలో అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ‘కవిత అప్‌డేట్స్’ పేరిట కొనసాగుతోన్న ‘ఎక్స్’ అకౌంట్స్‌లో ఒక్కొక్కరి జాతకాలు బయట పెడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌కు చెందిన ఓ నేత అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మున్ముందు మరిన్ని బయట పెడుతామని పోస్టుల్లో హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పుడు.. ఎవరి బండారం బయటకు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ లోగో డెలిట్

గతంలో కవిత అఫీషియల్ ‘ఎక్స్’ అకౌంట్ వాల్ పోస్టర్‌పై ఓ వైపు బీఆర్ఎస్ లోగో, మరో వైపు కేసీఆర్ ఫొటో ఉండేది. కానీ కవిత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ వాల్ పోస్టర్ నుంచి పార్టీ లోగో తొలగించారు. కేసీఆర్ ఫొటో మాత్రం అలాగే ఉండిపోయింది.

Read More..

అప్పుడే మాట్లాడుతా.. కవిత ఆరోపణలపై హరీష్ రావు!

Next Story