Harish Rao: అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టు.. ఖండించిన హరీశ్ రావు

by Prasad Jukanti |   (  Updated:2026-01-14 07:54:34  IST  )

మహిళా ఐఏఎస్‍పై కథనాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Harish Rao: అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టు.. ఖండించిన హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలన చేతగాని సర్కారు పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పండుగ వేళ, అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా IAS మంత్రి వార్త కథనాల వ్యవహారంలో గత రాత్రి ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‍కు చెందిన ముగ్గురు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ఇవాళ హరీశ్ స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇది ప్రజాస్వామ్యంపై దాడి:

తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి చేస్తోందని ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్‍లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని నిలదీశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE ....

బీజేపీలోకి హరీష్ రావు!! ఖండించిన BRS

Next Story