బీజేపీలోకి హరీష్ రావు!! ఖండించిన BRS

by Muthe.Rajitha |   (  Updated:2026-01-14 06:25:18  IST  )

హరీష్ రావుపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని గులాబీ పార్టీ ఖండించింది.

బీజేపీలోకి హరీష్ రావు!! ఖండించిన BRS
X

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావు కమలం గూటికి చేరతారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కావాలనే చేస్తున్న ఇలాంటి చిల్లర ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. మనందరి ముందున్న ఒకే లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమని, కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడడమే మన తక్షణ కర్తవ్యమని పేర్కొంది.

అందరం ఐక్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెబుతూ.. జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ అని ట్వీట్ చేసింది. కాగా సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల అమిత్ షాను కలిశారని.. 17 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో త్వరలోనే బీజేపీలోకి చేరతారని సోషల్ మీడియాలో, పలు వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరిగింది.

READ MORE ....

Harish Rao: మహిళా ఐఏఎస్‍ పట్ల కథనాలపై అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టు.. ఖండించిన హరీశ్ రావు

Next Story