- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఈ క్యాబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్యాబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్యాబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తారాఖండ్‌లో ఈ క్యాబినెట్ విధానం అమలులో ఉంది. దీని ఆధారంగా ఈ క్యాబినెట్ సొల్యూషన్స్‌ను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్‌తో ప్రభుత్వం చర్చలు జరిపింది. అంతేకాకుండా ఈ క్యాబినెట్ అమలుకు టీడీటీఎస్‌ను నోడల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తొలివిడతగా రూ.20 లక్షల నిధుల విడుదలకు సైతం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ వీక్షణ ఉంటుంది. ఈ నిర్ణయంతో క్యాబినెట్ నోట్స్, ప్రతిపాదనలు, నిర్ణయాలు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్ వేర్ హ్యాక్ అవ్వకుండా ప్రత్యేక లాగిన్ ఐడీ, పాస్ వర్డ్స్‌తో సెక్యురిటీకి ఎక్కువ ప్రధాన్యతను ఇవ్వనున్నారు. ఈ క్యాబినెట్ విధానంలో ఎక్కడ నుండి అయినా.. ఎప్పుడైనా కేబినెట్ ఎజెండాలను పరిశీలించే సౌకర్యం ఉంటుంది. దీంతో సమావేశాలకు ముందు, తరవాత ఫైళ్ల నిర్వహణ సులభతరం కానుంది. పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.






