నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. వీటిపైనే చర్చ

by Ajay Maddhiboyina |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 లకు సచివాలయంలో మంత్రులతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షించనున్నారు.

నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. వీటిపైనే చర్చ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 లకు సచివాలయంలో మంత్రులతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షించనున్నారు. ఐఆర్ఎఫ్‌సీ నుండి మెట్రో లోన్ జాప్యంపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రైతు భరోసా నిధుల విడుదల తేదీని సైతం ఈరోజు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. తుమ్మడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర వైఖరితో పాటు కేంద్రం దగ్గరకు మంత్రులు వెళ్లే విషయంపైనా చర్చించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఈ విషయాలన్నీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉన్నాయి. మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు మంజూరైన లోన్ ఆలస్యం అవ్వడం ప్రభుత్వానికి టెన్షన్ గా మారింది. ఒప్పందం కుదిరి 20 రోజులు దాటినా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వంపై రోజుకు రెండున్నర కోట్ల భారం పడుతోంది. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తుమ్మడిహెట్టి విషయంలోనూ చాలా రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగూతూనే ఉంది. దీంతో ఈ విషయాలపై సమావేశంలో ఏం చర్చిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story