- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లిన కూలీ మృతి...
చేపల వేటకు వెళ్లిన ఓ కూలీ చెరువులో పడి మృతి చెందాడు.

దిశ, జగదేవపూర్: చేపల వేటకు వెళ్లిన ఓ కూలీ చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలీరాజ్‌పేట్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలీరాజ్‌పేట్ గ్రామానికి చెందిన ద్యాప మల్లేశం (45) బుధవారం ఉదయం చేపల వేట కోసం పక్క గ్రామమైన నిర్మల్‌నగర్ గ్రామ శివారులోని మొధుగుంటకు వెళ్లాడు. చేపల కోసం వెళ్లిన మల్లేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మల్లేశం ఆచూకీ కోసం ఇరుగుపొరుగు వారిని అడిగిన లభించలేదు. ఈ మేరకు మృతుని కుమార్తె ద్యాప నిఖిత జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కలిసి మొధుగుంటలో గాలింపు చేపట్టగా గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో మొధుగుంటలో మల్లేశం మృతదేహాన్ని గుర్తించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జగదేవపూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మల్లేశం మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది






