- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ సారూ జర చూడండి.. 108 వాహనానికి గూడు కరువు
ఆపదలో ఉన్నవారికి ఆదుకునే 108 వాహనానికి గూడు కరువైంది.

దిశ, ఏన్కూర్: ఆపదలో ఉన్నవారికి ఆదుకునే 108 వాహనానికి గూడు కరువైంది. గతంలో 108 వాహనానికి గూడు కరువు అనే వార్తకు స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కల్లూరు డిప్యూటీ డిఎంహెచ్వోకు ఆదేశాలుస్తూ 108 వాహనంపై షెడ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు నేటి వరకు అమలు జరగక 108 వాహనం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితులు ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిన ఇతర సంఘటన ఏమి జరిగినా జిల్లా కేంద్రానికి రోగులను తీసుకెళ్లేందుకు 108 వాహనం ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వాహనానికి గూడు కల్పించవలసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్ల సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్యూటీలు వారీగా ఇక్కడ ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వారు రాత్రి సమయంలో కూలిపోయిన భవనంలోనే ఉండవలసిన పరిస్థితి నెలకొంది. 108 సిబ్బంది కి క్వార్టర్స్ నిర్మాణం జరిపి. 108 వాహనానికి గూడు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ సారు చర్యలు తీసుకుంటారని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






