సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మ‌రోసారి అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మ‌రోసారి మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సాయికృష్ణ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింద‌ని అన్నారు. సాయికృష్ణ‌ను వెతుకుతున్నామ‌ని పోలీసులు చెబుతున్నార‌ని, కానీ అత‌డు బ‌తికిలేడ‌ని అన్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మ‌రోసారి అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మ‌రోసారి మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సాయికృష్ణ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింద‌ని అన్నారు. సాయికృష్ణ‌ను వెతుకుతున్నామ‌ని పోలీసులు చెబుతున్నార‌ని, కానీ అత‌డు బ‌తికిలేడ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై తాము రాజ‌కీయాలు చేయ‌డంలేదని ఒక త‌ల్లి ఆవేద‌న‌ను మాత్ర‌మే వ్య‌క్తం చేస్తున్నామ‌ని చెప్పారు. సీనియ‌ర్ ఐపీఎస్ విచార‌ణ‌లో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయా అని ప్ర‌శ్నించారు. గ్యాంగ్ వార్ లో సాయికృష్ణ ఏమైపోయాడో తెలిద‌ని రిపోర్ట్ ఇస్తార‌ని చెప్పారు. కృష్ణ‌లంక పీఎస్ లో ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ జ‌ర‌గాల‌ని అంబ‌టి డిమాండ్ చేశారు. హ‌త్య చేయ‌డం మొద‌టి నేర‌మైతే, డెడ్ బాడీని మాయం చేయ‌డం రెండో నేరం అని అన్నారు. ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. క‌మిష‌న‌ర్ ను స‌స్పెండ్ చేయాల‌ని, బాధ్యులంద‌రికీ క‌ఠిన శిక్ష విధించాల‌న్నారు. ఇదిలా ఉంటే సాయికృష్ణ‌ను నాగ‌రాజు అనే సీఐ కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ తీసుకెళ్లార‌ని అత‌డి తల్లి చెబుతున్నారు. త‌న కుమారుడిని చంపేస్తామ‌ని బెదిరించార‌ని చెప్పారు. సాయికృష్ణ‌ను లాక్ డెత్ చేసి అత‌డి శ‌వాన్ని కూడా మాయం చేశార‌ని అత‌డి మేన‌మామ ఆరోపిస్తున్నారు.

Next Story