- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వా సింగిల్ టేక్‌కు 200 మంది స్టాండింగ్ ఓవేషన్.. ‘భోగి’పై పెరిగిన అంచనాలు
భోగి క్లైమాక్స్‌లో శర్వానంద్ నటనకు సెట్లో ఉన్న దాదాపు 200 మంది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'భోగి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన ఈ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సన్నివేశాన్ని శర్వానంద్ సింగిల్ టేక్‌లో పూర్తి చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ సన్నివేశం పూర్తయ్యాక సెట్లో ఉన్న దాదాపు 200 మంది సభ్యులు శర్వానంద్ నటనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్లైమాక్స్ సీన్ శర్వానంద్ కెరీర్‌లోనే అత్యుత్తమ సన్నివేశాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్లను మినహాయిస్తే పెద్దగా అప్డేట్లు బయటకు రాకపోయినా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి 'భోగి' చిత్రంతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






