- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కార్‌తో నేడు ‘గూగుల్’ కీలక ఒప్పందం.. ఏకంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
విదేశీ పెట్టుబడులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక అడుగు వేయబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పెట్టుబడులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక అడుగు వేయబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) సంస్థతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీ (Delhi)లోని టాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఉదయం 10 గంటలకు గూగుల్ ప్రతనిధులను సీఎం చంద్రబాబు (CM Chandrababu), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భేటీ కాబోతున్నారు. సుమారు 10 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.84,000-88,000 కోట్ల) పెట్టుబడితో విశాఖపట్నంలో ఆసియాలోనే ఫస్ట్ 1 గిగావాట్ (GW) హైపర్‌స్కేల్ డేటా సెంటర్, AI హబ్ ఏర్పాటు కానుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి (FDI)లలో ఒకటిగా పరిగణించబడుతోంది. గూగుల్ రాకతో 2028-2032 మధ్య ఏటా రాష్ట్ర GSDPకి రూ.10,518 కోట్లు సహకారం అందనుంది. గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్ష, పరోక్షంగా సంవత్సరానికి యువతకు 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, హెల్త్‌కేర్, పర్యావరణ స్థిరత్వం వంటి రంగాల్లో పైలట్ ప్రాజెక్టులకు ఎంతగాగో దోహదపడనుంది.
READ MORE ......
క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ.. ఎంపీల భేటీలో సీఎం చంద్రబాబు






