క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ.. ఎంపీల భేటీలో సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 02:56:11  IST  )

ములకల‌చెరువు (Mulakala Cheruvu) నకిలీ మద్యం కేసులో అనూహ్యంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పేరు తెరపైకి వచ్చింది.

క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ.. ఎంపీల భేటీలో సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ములకల‌చెరువు (Mulakala Cheruvu) నకిలీ మద్యం కేసులో అనూహ్యంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పేరు తెరపైకి వచ్చింది. కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఓ సంచలన వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియాలో అతడు మాట్లాడుతూ.. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని వాంగ్మూలం ఇచ్చాడు. ఈ క్రమంలోనే మొత్తం ఎపిసోడ్‌పై తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమావేశంలో మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య తరహాలోనే నకిలీ మద్యం కేసును తీసుకొచ్చారని కామెంట్ చేశారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ (Jagan) ఉదాహరణ అని అన్నారు. నేరాలు, ఘోరాలతో రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ (YCP) క్రిమినల్ కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దర్యాప్తు చేస్తున్నా కొద్దీ నిజాలు బయటపడుతున్నాయని అన్నారు. వాళ్ల నేరాలను టీడీపీ (TDP)పై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు రెడీ.. జోగి రమేష్

నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఈ విషయంలో తిరుమల (Tirumala) సన్నిధిలో ప్రమాణం చేస్తానని.. మీరు సిద్ధమా అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు తేలితే దేనికైనా సిద్ధమేనని అన్నారు. నిందితుడు జనార్ధన్ రావుతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. సిట్‌కు కథ, స్క్రీన్ ‌ప్లే, దర్శకత్వం సీఎం చంద్రబాబేనని అన్నారు. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

READ MORE ......

ఏపీ సర్కార్‌తో నేడు ‘గూగుల్’ కీలక ఒప్పందం.. ఏకంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

Next Story