- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశావహులకు గుడ్ న్యూస్.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే.. పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా పోటీకి అర్హులు కానున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు ముగ్గురు పిల్లలున్న వారు పోటీకి తాము కూడా సై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి రాష్ట్రంలో వరి రికార్డు స్థాయిలో సాగు అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పథకం కొనసాగుతోందని స్పష్టం చేశారు. మెట్రో 2A, 2B నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలను సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ కమిటీ నివేదికను రూపొందించి కేబినెట్‌కు అందజేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.. ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న






