- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. హెలికాప్టర్ సేవలు ప్రారంభం
మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రూ.4,800 చార్జీగా నిర్ణయించారు.
ఈ నెల 31వ తేదీ వరకు..
అలాగే హన్మకొండ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి రూ.35,999గా ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారులు సమాచారం. తాడ్వాయి మండలం ఎలుబాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి.
Read More..






