- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. గతంలో కాలినడకన నుంచి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థవారు హెలికాప్టర్ సేవలు సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి మేడారం వరకు తిరిగి మేడారం నుంచి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందని, అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4 వేల 800 వందల రూపాయల టికెట్ ను ఖరారు చేశారని వివరించారు.
గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 2 వందల 51 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భారత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
READ MORE .....






