గొల్లకుర్మలకు తీపికబురు.. గొర్రెల పంపిణీ డేట్ ఫిక్స్

by Disha Web Desk 4 |
గొల్లకుర్మలకు తీపికబురు.. గొర్రెల పంపిణీ డేట్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 9 నుండి గొర్రెల పంపిణీ పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల యూనిట్‌ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నకిరేకల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈనెల 8 వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నమన్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. గొర్రెల యూనిట్‌ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్‌లను కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Also Read.. వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!

ఎమ్మెల్యే రసమయి‌కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు..

Next Story