భద్రాచలం వద్ద మళ్ళీ పెరుగుతున్న గోదావరి

by Disha Web Desk 2 |
భద్రాచలం వద్ద మళ్ళీ పెరుగుతున్న గోదావరి
X

దిశ, భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా క్రమంగా పెరిగిన గోదావరి వరద నీటిమట్టం 12వ తేదీ ఉదయం 52.50 అడుగుల వద్దకు చేరి కొన్నిగంటలపాటు నిలకడగా ఉండి ఆ తర్వాత మెల్లగా తగ్గడం ప్రారంభించిన గోదావరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు 46.30 అడుగులకు తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ పెరుగుతూ రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటడంతో అధికారులు అప్రమత్తమైనారు. మంగళవారం ఉదయం 9 గంటలకు 50.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద గంటగంటకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 12,72,480 క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరద పెరుగుదల దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనుదీప్ వరద ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

జూరాలకు భారీ వరద.. 44 గేట్లు ఎత్తివేత..


Next Story