Breaking: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-05 08:50:42  IST  )

పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ...

Breaking: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Former YSRCP MLA Bolla Brahmanaidu)ను సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) తమిళనాడులోని కాంచీపురం(Kanchipuram in Tamil Nadu)లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేట(Hyderabad Gandipet) పరిధిలో భూ కబ్జా(Land Grab)కు యత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ఆయన కొంతకాలంగా పరారీలో ఉన్నారు.

బెయిల్ విషయంలో నిరాశే

అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో పోలీసులు ఆయన కోసం నిఘాను మరింత ముమ్మరం చేశారు.

హైదరాబాద్ తరలింపు

ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాంచీపురం నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Next Story