- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మనాయుడి అరెస్టు అక్రమం: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుల్ని వెంటాడి అరెస్టు చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గండిపేట(Hyderabad Gandipet)లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి(Vinukonda MLA Bolla Brahma Naidu)ని సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) తమిళనాడు రాష్ట్రం కాంచీపురం(Kanchipuram)లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
తీవ్రంగా ఖండించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అయితే బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుల్ని వెంటాడి అరెస్టు చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బ్రహ్మనాయుడుపై ఆరోపిస్తున్న ఆ భూమికి సంబంధించి అవకతవకల్ని బయటకు తీసుకొచ్చిందే ఆయన మనుషులు అని చెప్పారు. నేరుగా అగ్రిమెంట్లో కూడా ఎక్కడా ఆయన లేరని తెలిపారు. బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నమ్మి అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అగ్రిమెంట్ పూర్తిగా రమేష్ పేరు మీదే ఉందని తెలిపారు. ఎంతకీ భూముల రిజిస్ట్రేషన్‌కు ముందుకు రాకపోవడంతో అనుమానం వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
అన్యాయంగా ఇరికించారు..
అధికారులు ఆరా తీస్తే, నకిలీ జీవోల ద్వారా అమ్మేందుకు ప్రయత్నించారని తేలిందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉదంతంలో నష్టపోయింది బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అన్యాయంగా బ్రహ్మనాయుడును ఇందులో ఇరికించారని ఆరోపించారు. బ్రహ్మనాయుడు కేవలం రమేష్‌కు ఆర్థిక సహాయం మాత్రమే చేశారని చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోవడం లేదని విమర్శించారు. అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కూడా ఇక్కడివారేనని తేలిపోతోందని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని బ్రహ్మనాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అన్యాయాలు, అక్రమాలు చేయాల్సిన అవసరం, అంతటి దౌర్భాగ్యం బ్రహ్మనాయుడుకు లేదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.






